గుంటూరు జిల్లాలో టిడిపి నుండి వైసిపిలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో శాసన సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మకాయల రాజనారాయణ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 27న సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా వైసిపిలోకి చేరుతున్నారు.  

ఇదే విషయాన్ని నిమ్మకాయల రాజనారాయణ కూడా ధృవీకరించారు.  టీడీపీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆతుకూరి నాగేశ్వరరావు కూడా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని నిమ్మకాయల వర్గీయులు చెబుతున్నారు. వైసిపిలో చేరనున్న నిమ్మకాయలను తెలగ సంఘం అధ్యక్షుడు ఆకుల శివయ్య తదితరులు ఘనంగా సన్మానించారు.