పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రతో జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అపశృతి చోటు చేసుకుంది..  

దెందులూరు : టీడీపీ ఎమ్మెల్యే Nimmala Ramanaidu సైకిల్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. bicycle మీదినుంచి కిందపడడంతో ఆయన ఎడమకాలికి స్వల్ప గాయమయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శింగవరం వద్ద ఘటన జరిగింది. Tidco Homes లబ్ది దారులకు అప్పగించాలనంటూ పాలకొల్లు నుంచి అమరావతి వరకు నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ హత్యకు కుట్రలు పన్నుతున్నది స్వయంగా రాష్ట్ర ముుఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్యను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే తన స్వార్థరాజకీయాలకు వాడుకున్నారో అలాగే వంగవీటి రాధ ను బలితీసుకుని తిరిగి అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నిమ్మల ఆరోపించారు. 

''దివంగత వంగవీటి మోహనరంగా గురించి, ఆయన తనయకుడు రాధా ఇంటి దగ్గర జరిగిన రెక్కీ గురించి, కాపుల బాగోగుల గురించి వైసీపీ నేతలు, ఆ ప్రభుత్వం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, రాక్షసులు వేదపారాయణం చేసినట్లుగా ఉందని ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. 

''కాపులను ఎవరు ఆదరించి అభిమానిస్తున్నారో, ఎవరు అణగదొక్కుతున్నారో కాపులకే బాగా తెలుసు. కాపులకు టీడీపీ ప్రియమైన మిత్రువైతే, వైసీపీ బద్ధశత్రువు అనే పచ్చినిజాన్ని ఆ సామాజివర్గ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. కాపులను టీడీపీ ఎంతగానో ఆదరించింది... కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆ వర్గాన్ని, ప్రముఖులైన నేతలను అణచివేసే పనిలోనే ఉంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''ప్రస్తుత పరిస్థితుల్లో కాపువర్గంలో అమాయకులెవరూ లేరని ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీవారు గుర్తిస్తే మంచింది. ఆనాడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వరకు కాపులపై ఈర్ష్యాద్వేషాలతోనే వ్యవహరిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లను రద్దుచేసి వారికి తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారు. వాటన్నింటిని కాపులు గమనిస్తున్నారు'' అని నిమ్మల తెలిపారు.