తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం దొరకడం తన అదృష్టమని, పూర్వ జన్మ సుకృతమని టీడీపీ నేత, సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కవి కురచా నరసింహ నాయుడు అన్నారు. ఆదివారం విశాఖలోని శారదాపీఠంలో స్వరూప నరేంద్ర సరస్వతిని దర్శించుకునేందుకు కేసీఆర్‌ దంపతులు నగరానికి వచ్చారు.

 ఈ సందర్భంగా చీడికాడ మండలానికి చెందిన కవి నరసింహ నాయుడు దంపతులు వెళ్లి కేసీఆర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ నరసింహ నాయుడుతో 1996లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కార్యక్రమంలో నాయుడు సతీమణి అమ్మాజీ, తన కుమారులు కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.