ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆర్కే, టీడీపీ నేత నారా లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.

అసెంబ్లీ లాబీలోని వైఎస్‌ఆర్‌ఎల్పీ కార్యాలయం వద్ద ఆర్కే కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో శాసనసమండలి సమావేశానికి వెళుతున్న లోకేశ్.. ఆర్కేను చూసి పలకరించారు.

ఎన్నికల్లో విజయం సాధించినందుకు షేక్ హ్యాండిచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో గానీ, అంతకు మందు కానీ ఇద్దరు నేతలు ఎదురుపడ్డ సందర్భం లేదు.  

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్‌పై రామకృష్ణారెడ్డి 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదట్లో ఆళ్లకు గట్టి పోటి ఇచ్చిన లోకేశ్.. ఆ తర్వాత ఆధిక్యం విషయంలో వెనకబడుతూ వచ్చారు.