Asianet News TeluguAsianet News Telugu

ఆ రోడ్డంతా గతుకుల మాయం.. తక్షణం మరమ్మత్తులు చేయించండి : ఏపీ ప్రభుత్వానికి లోకేశ్ లేఖ

అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టి సారించాలని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందన్నారు. 
 

tdp leader nara lokesh letter to r and b chief secretary for roads condition in amaravathi
Author
First Published Nov 5, 2022, 6:44 PM IST | Last Updated Nov 5, 2022, 6:44 PM IST

రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టి సారించాలని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి వెళ్లే రహదారి మరీ అధ్వాన్నంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది-అధ్యాపకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ లేఖలో ప్రస్తావించారు. తక్షణ మరమ్మతులు చేయాలని లేఖలో నారా లోకేష్ డిమాండ్ చేశారు. రహదారులతో పాటు మౌలిక సదుపాయాలుంటే విద్య, వైద్య ఇతర రంగాలలో ప్రగతి సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో  స్థాపించిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్లే రోడ్ల దయనీయ స్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. 

ALso Read:ప్యాలెస్‌లో వున్న వ్యక్తికి సామాన్యుల బాధలు కనిపించవు.. మహిళ ఆత్మహత్యాయత్నంపై నారా లోకేష్

విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారుల దుస్థితిపై నాకు అనేక ఫిర్యాదులు అందచేశారని లోకేశ్ తెలిపారు. ఆ మార్గంలో వెళ్లాలంటే భయంగా ఉందని వారంతా ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తరచూ ప్రమాదాలు, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్వానమైన రోడ్ల వల్ల ప్రయాణ సమయం అధికమై విద్యార్థులు, బోధనా సిబ్బంది అమూల్యమైన సమయం కూడా వృధా అవుతోందన్నారు. మీరు స్పందించి, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios