మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ పలు దశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పంచాయితీల్లో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్ధులే అత్యధికంగా గెలిచారు. అయితే సంఖ్యాపరంగా వైసిపిదే  విజయమైన అసలు విజేతలం తామేనని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల ఫలితాలపై లోకేష్ సోషల్ మీడియా వేదికన స్పందించారు.  

''డెమోక్ర‌సీకి జ‌గ‌న్ మోనోక్ర‌సీకి మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొంత తేడాతో సంఖ్యా విజ‌యం వైసీపీ‌దైనా అస‌లు సిస‌లు గెలుపు టిడిపిదే. అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్ర‌కారం జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను సీఎం జగన్ త‌న‌ రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు''

''క‌ట్టేసి కొట్టారు, అయినా వెన‌క్కిత‌గ్గ‌ని టిడిపి అభ్య‌ర్థులు లెక్కింపులో ముందంజ‌లో వుంటే.. క‌రెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాల‌కు తాళాలేసారు. పోలీసుల‌తో బెదిరించారు. దాడులు చేశారు. టిడిపి మ‌ద్ద‌తుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్ర‌క‌టించుకున్నారు''

''ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఎన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు పాల్ప‌డినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన‌ టిడిపి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు''

read more   ముగిసిన పంచాయితీ ఎన్నికలు...మొత్తం ఏకగ్రీవాల శాతం ఎంతంటే: ఎస్ఈసి నిమ్మగడ్డ

''దాడులు, అరాచక పాలనతో రెచ్చిపోతున్న సీఎం జగన్ కి ప్రజాస్వామ్యబద్ధంగా జవాబు చెబుతున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి నిత్యం రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం పోయి 2 ఏళ్ళు కావొస్తుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగంతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి పోరాడుతున్న మీకు పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుంది'' అంటూ మాజీ ఎమ్మెల్యే సౌమ్యకు లోకేష్ అండగా నిలిచారు.