Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన పంచాయితీ ఎన్నికలు...మొత్తం ఏకగ్రీవాల శాతం ఎంతంటే: ఎస్ఈసి నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేవని... అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందన్నారు ఎస్ఈసి నిమ్మగడ్డ.

16Percet Panchayats Unanimous in AP... SEC Nimmagadda Ramesh Kumar
Author
Amaravathi, First Published Feb 22, 2021, 11:01 AM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పలు దశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముగిశాయి. నిన్న(ఆదివారం)చివరిదశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ... ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేవన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేవన్నారు. అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందన్నారు. 

''మొత్తం 13,097 స్ధానాలకు ఎన్నికలు అయితే 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. 10,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారు. వీరిలో 50% మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారు. గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వ్యవస్ధకు వస్తుందని ఎస్ఈసీ ఆశిస్తోంది'' అన్నారు.

''పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేసారు. 80% కంటే ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆరోగ్యశాఖ కోవిడ్ నేపధ్యంలో చక్కని ఏర్పాట్లు చేసారు. డీజీపీ, సీఎస్ కూడా సమయానుకూలంగా సూచనలిస్తూ పనిచేసారు'' అంటూ వివిధ శాఖల అధికారులను ఎస్ఈసీ అభినందించారు.

read more   పంచాయితీ: నిమ్మగడ్డపై టీడీపీ రివర్స్, వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు

''కోర్టు అవరోధాలు కూడా తొలిగిపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి నిర్వహిస్తాం. మునిసిపల్ ఎన్నికలలో పట్టణ ఓటర్లు ఖచ్చితంగా ఓటు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ మునిసిపల్ పోలింగ్ వుంటుంది'' అని పేర్కొన్నారు. 

''ఇవాళ(సోమవారం) డీజీపీ, సీఎస్ ల సమక్షంలో కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. నామినేషన్ వేయలేకపోయినవారు రుజువులతో సహా కలెక్టర్లను సంప్రదిస్తే నామినేషన్ స్వీకరిస్తారు.హైకోర్టు సూచనలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవి'' అని నిమ్మగడ్డ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios