Asianet News TeluguAsianet News Telugu

ముందు రాసినొళ్లకు దిక్కులేదు.. మళ్లీ ఇంకో నోటిఫికేషనా: జగన్‌పై లోకేశ్ ఫైర్

జగన్ రెడ్డి గారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. 

tdp leader nara lokesh fires on ap cm ys jagan mohan reddy over unemployement
Author
Amaravathi, First Published Jul 18, 2020, 3:33 PM IST

జగన్ రెడ్డి గారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. శనివారం వరుస ట్వీట్లతో స్పందించిన ఆయన .. జగన్ రెడ్డి గారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కి తీరని అన్యాయం చేస్తున్నారు.''యువ‌నేస్తం''నిరుద్యోగ భృతి పథకం ఎత్తేయడం, సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ దగ్గర నుండి ఈ రోజు వరకూ నిరుద్యోగులు దగా పడుతూనే ఉన్నారని ట్వీట్ చేశారు.

గ్రామ సచివాలయం పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు సుమారుగా 10 వేల మంది ఉన్నారని లోకేశ్ చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులు, అదనంగా ప్రభుత్వం ప్రకటించిన 3 వేల సచివాలయ ఉద్యోగాల్లో అర్హులైన మొదటి నోటిఫికేషన్ సచివాలయ అభ్యర్థులకు అవకాశం కల్పించలేదని ఆయన మండిపడ్డారు.

ఇవేవి చేయకుండా రెండో నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటీ.? అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగం కల్పిస్తామన్న జగన్ రెడ్డి గారి హామీ ఏమయ్యిందని లోకేశ్ ప్రశ్నించారు. తక్షణమే అర్హత సాధించి మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్ధులతో పోస్టులు భర్తీ చెయ్యాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios