Asianet News TeluguAsianet News Telugu

ఆ పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊరికే వదలదు: లోకేష్ శాపనార్థాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్న కూల్చివేతలపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పదించారు.
 

TDP Leader Nara Lokesh fires on Alla Ramakrishna Reddy
Author
Mangalagiri, First Published Mar 22, 2021, 3:43 PM IST

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పదించారు.

''లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారు వైకాపా నేతలు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నాడు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు'' అని లోకేష్ మండిపడ్డారు. 

''మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవడిచ్చాడు?పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా టిడిపి పోరాడుతుంది'' అని లోకేష్ ప్రకటించారు. 

video   కోర్టులో విచారణకు ముందే... ఇళ్ల కూల్చివేత: ఆత్మకూరులో ఉద్రిక్తత

ఇదిలావుంటూే గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని... ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేయిస్తే తాము నిరాశ్రయులమై రోడ్డున పడతామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చేవేతలను వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ ఈరోజు కోర్టు లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే  బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios