ఏపీకి ప్రత్యేక హోదా: టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ముందుకు వస్తే తాము కూడా ఆ పార్టీతో కలిసి నడుస్తామని టీడీపీ నేత నక్కా ఆనంద బాబు చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

TDP leader Nakka Anand Babu interesting comments on Special status  to AP


గుంటూరు:ఏపీ సీఎం YS Jagan  ముందుకు వస్తే TDP పక్షాన ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తామని మాజీ మంత్రి నేత నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం నాడు Nakka Anand Babu మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ పెద్దలు కూడా  ఈ విషయమై మాట్లాడాలని ఆయన కోరారు.

కేంద్రం మెడలు వంచి Special Status తెస్తానని జగన్ చెప్పారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  మెడలు వంచినోళ్లు వంచినట్లే ఉంటూ Narendra Modi దగ్గర సాగిలపడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. . కేసులు తొలగించుకునేందుకు దించిన మెడను ఎత్తడం మానేశారని ఎద్దేవా చేశారు. 

Andhra Pradesh, Telangana రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల కాలంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశం ఉంది. ఆ తర్వాత ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలను కూడా తొలగించారు.

టీడీపీచీఫ్ Chandrababu కుట్రతోనే త్రీమెన్ కమిటీ ఎజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగించారని వైసీపీ ఆరోపణలు చేసింది.ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అంశం ఎజెండా నుండి తొలగించడానికి గల కారణంపై మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేయాలని కూడా బీజేపీ ఎంపీ GVL Narasimha Rao ఓ లేఖ కూడా రాశారు.ఈ విషయంలో తనపై వైసీపీ ఆరోపణలు చేయడాన్ని జీవీఎల్ నరసింహారావు తప్పుబట్టారు.

ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం లేదని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ పేరుతో ఏపీ రాష్ట్రానికి నిధులను కేంద్రంఇస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గతంలోనే ప్రకటించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన చెప్పారు.

గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. తమ పార్టీకి 25 మంది ఎంపీలను  ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పారు. కానీ, కేంద్రంలో బీజేపీకి ఏకపక్ష మెజారిటీ దక్కింది. దీంతో వైసీపీకి 22 ఎంపీలు గెలిచినా కూడా లాభం లేకుండా పోయింది. ఇతర పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ కొనసాగే పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండేదనే అభిప్రాయాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా తాము ప్రత్యేక హోదా విషయమై సమయం దొరికినప్పుడల్లా పోరాటం చేస్తున్నామని వైసీపీ చెబుతుంది.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios