Asianet News TeluguAsianet News Telugu

రామ్ గోపాల్ వర్మను తరిమి కొడతారు.. టీడీపీ నేత

వర్మకు పిచ్చి పట్టిందని, తక్షణం ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి మానసిక వైద్యం చేయించాలన్నారు. యూట్యూబ్‌లో వర్మ విడుదల చేసిన పాటపై తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 

tdp leader murali fire on director RGV over lakshmi's NTR movie
Author
Hyderabad, First Published Dec 24, 2018, 11:18 AM IST

లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కించపరిచేలా ఉన్న సీన్లు తొలగించాలని టీడీపీ గుంటూరు జిల్లా కార్యదర్శి వీరవల్లి మురళీ డిమాండ్ చేశారు.  అలా చేయకపోతే.. రామ్ గోపాల్ వర్మను ఏపీ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల వెన్నుపోటు అనే పాటను విడుదల చేశారు. దీంట్లో చంద్రబాబును కించపరిచేలా పాటను తెరకెక్కించారు. ఈ పాటపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

కేవలం పబ్లిసిటీ కోసం ప్రతిపక్షాలకు అమ్ముడుపోయి బాధ్యత గల సీఎంను అవమానించేలా, వ్యంగ్యంగా సినిమాలో సన్నివేశాలను, పాటలను రూపొందిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మురళీ అన్నారు.  ప్రతిపక్ష నేతగా పదేళ్లు, రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.
 
దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబును చులకన చేసేలా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్మకు పిచ్చి పట్టిందని, తక్షణం ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి మానసిక వైద్యం చేయించాలన్నారు. యూట్యూబ్‌లో వర్మ విడుదల చేసిన పాటపై తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వర్మ పైశాచికం చివరిస్థితికి చేరిందన్నారు. తక్షణం ఆయా సన్నివేశాలను తొలగించకుంటే వర్మను రోడ్డు మీద తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios