నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట టిడిపిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పాదయాత్రలో భాగంగా జిల్లాలోని సూళ్ళూరుపేటలో తిరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టిడిపి కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి కలవటమే కలకలానికి కారణం. బుధవారం మద్యాహనం వైసిపి అధ్యక్షుడని వేనాటి కలిశారు. సూళ్ళూరుపేట మున్సిపాలిటిలో వేనాటి కౌన్సిలర్ గా ఉన్నారు.

వేనాటి అంటే ఒక్క కౌన్సిలర్ మాత్రమే కాదు. వేనాటి తండ్రి వేనాటి రామచంద్రారెడ్డి జిల్లా పరిషత్ టిడిపి ఫ్లోర్ లీడర్. జిల్లాలోని సూళ్ళూరుపేట, నెల్లూరు ప్రాంతాల్లో ఈ కుటుంబానికి గట్టి పట్టుంది. టిడిపి ఏర్పాటైనదగ్గర నుండి వేనాటి కుటుంబం టిడిపిలోనే కొనసాగుతోంది. అటువంటిది సుమంత్ రెడ్డి వైసిపి అధ్యక్షుడిని కలవటమం మామూలు విషయం కాదు.

తండ్రికి తెలీకుండానే, ఆమోదం లేకుండానే సుమంత్ వైసిపి అధ్యక్షుడిని కలిసే అవకాశమే లేదు. కాబట్టి వేనాటి కుటుంబంలో తెరవెనుక ఏదో జరుగుతోందని టిడిపి నేతలే అనుకుంటున్నారు. పైగా చంద్రబాబునాయుడు కూడా తమను పట్టించుకోవటం లేదని వేనాటి కుటుంబంలో ఎప్పటి నుండో అసంతృప్తి ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.