వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి.. టీడీపీ నేత కుటుంబరావు కౌంటర్ ఇచ్చారు. కుటుంబరావును బ్రోకర్ అంటూ.. ఇటీవల విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఆ కామెంట్స్ పై కుటుంబరావు స్పందించారు.

అవును తాను బ్రోకర్ నేనని...తాను స్టాక్‌ బ్రోకర్‌గా 15 ఏళ్లు పని చేశానని, ఆ పని చేయడం తప్పు కాదన్నారు.తాను ఎప్పుడూ ఆర్థిక శాఖ సమావేశాల్లో పాల్గొనలేదని చెప్పారు. తాను 12 కమిటీల్లో సభ్యునిగా ఉన్నానని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా తనకు ఆహ్వానం ఉన్న సమావేశాల్లోనే పాల్గొన్నానని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని విమర్శించడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.