ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు టీడీపీ నేత కూన రవికుమార్. దీనిపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం విద్యార్హతపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు . డిగ్రీ పాస్ కాకుండా బీఎల్ లా కోర్సులో ఎలా చేరారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి డిగ్రీ పూర్తి చేయకుండా ఎలా సర్టిఫికేట్ పెట్టారని రవికుమార్ ఆరోపించారు. సర్టిఫికెట్ ఫోర్జరీ చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి తక్షణం రాజీనామా చేయాలని రవికుమార్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని కూన స్పష్టం చేశారు. సీఐడీ విచారణ జరిపించాల్సిందిగా సీఎం జగన్‌కు లేఖ రాస్తామని రవికుమార్ పేర్కొన్నారు. దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
