సజ్జలరామకృష్ణారెడ్డి గుమాస్తాకు తక్కువ, జీతగాడికి ఎక్కువ అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు. తానేదో అపరమేథావి అయినట్టు ఆ జీతగాడు ప్రభుత్వ పక్షాన మాట్లాడతున్నాడు.

సాక్షిలో, లోటస్ పాండ్ లో జీతగాడిగా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేస్తున్నాడన్నారు. 50శాతం వ్యాక్సిన్లు తమకు అందించి, మిగిలినవాటిని రాష్ట్రాలకు అమ్ముకోవచ్చని వ్యాక్సిన్లు తయారుచేసే కంపెనీలకు కేంద్రం చెప్పిందని,  వ్యాక్సిన్ల కంపెనీలనుండి నేరుగా కొనుగోలు చేయడానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎటువంటి అనుమతి అక్కర్లేదని అన్నారు.  

కేబినెట్ మీటింగ్ లో కోవిడ్ అంశాన్ని చిట్టచివరన చేర్చి, కేవలం 45కోట్లతో అత్యల్పంగా 13లక్షల వ్యాక్సిన్లు కొనాలని నిర్ణయిస్తారా? అని ధ్వజమెత్తారు. దేశంలో అనేకరాష్ట్రాలతో పోలిస్తే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనరాష్ట్రం బాగా వెనుకబడి ఉంది అన్నారు.  

ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు: పోలీస్ కస్టడీ పొడగింపునకు కోర్టు నో...

కమీషన్లు రావనే సజ్జల, ముఖ్యమంత్రి వైఎస్ వ్యాక్సిన్ల కొనుగోలుకు ముందుకు రావడంలేదు అన్నారు. కమీషన్లు అందించే వ్యాక్సిన్ తయారీ కంపెనీలకోసం ఎదురుచూపులుచూస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

భవిష్యత్ లో హెటిరో లాంటి కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తే వాటితో డీల్ కుదుర్చుకుంటారా?  కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలు తీస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూఊరుకోదు అని హెచ్చరించరు. 

వైసీపీ ఎంపీలే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడని చెప్పుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏపీ ఆరోగ్యశాఖపై, వ్యవస్థలపై నమ్మకంలేక హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారన్నారు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఉండుంటే రాష్ట్రం ఇంతటి దౌర్భాగ్యకరమైన స్థితిలోఉండేది కాదని ప్రజలే అనుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే,  ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకుని, ఆ బాధ్యతలు చంద్రబాబుకి అప్పగిస్తే, వారంలో అంతా చక్కదిద్దుతారన్నారు. 

జగన్మోహన్ రెడ్డిలా తాడేపల్లిలో తిని తొంగునే రకం కాదు చంద్రబాబునాయుడు. పరిపాలన ఎలా చేయాలో, విపత్తులు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు చేసిచూపిస్తారు అన్నారు.

టీడీపీనేతలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి, వారికి  కోవిడ్ అంటిస్తున్నారన్నారు. 
ధూళిపాళ్ల నరేంద్రప్రాణానికి ఏం జరిగినా జగన్ రెడ్డిని, తాడేపల్లి జీతగాడిని వదిలేదిలేదని హెచ్చరించారు.

కరోనా కట్టడి : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.....

కోవిడ్ రెండోదశ తీవ్రతను ముందే ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. సజ్జలకు దమ్ముంటే, గత సంవత్సరంలో  ఈప్రభుత్వం ఆసుపత్రులను ఎలా అభివృద్ధి చేసిందో  శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు.

104, 108నంబర్లకు విజయసాయి రెడ్డి 20 నిమిషాలు ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు. 108, 104 వాహానాల వ్యవహారమే పెద్దస్కామ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్నపాటి దమ్ము, ధైర్యం కూడా జగన్ రెడ్డికి లేవు. బెయిల్ రద్దయితే జైలుకెళ్లాల్సి వస్తుందని ప్రధానిముందు సాష్టాంగపడిపోయాడని విమర్శించారు. 

రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంటే, బ్లాక్ మార్కెట్లో రూ.40, రూ.50వేలకు ఎందుకు అమ్ముతున్నారో సజ్జల చెప్పాలన్నారు. రేషన్ పంపిణీ సిబ్బంది, తమకు వ్యాక్సిన్లు వేసేవరకు పనిచేయమంటూ బియ్యం పంపిణీ నిలిపేశారన్నారు.

రేషన్ లో బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించాలన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, ఐసీయూ గదులు, పడకల ఏర్పాటుపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. 

వ్యాక్సిన్లు కొనడానికి మనసురాని ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే అన్నారు. 
తాడేపల్లి ప్యాలెస్ జీతగాడు పెద్ద మేథావిలా అబద్ధాలతో ప్రజలను మోసగించాలని చూస్తే, చూస్తూ ఊరుకోం అని ముఖ్యమంత్రికి చేతనైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలను కాపాడాలన్నారు. ఇతరులపైకి నెపాన్ని నెడితే ప్రజలు హర్షించరని అన్నారు.