Asianet News TeluguAsianet News Telugu

ఆ గేట్లకు గ్రీజు పెట్టలేవు... నువ్వా మూడు రాజధానులు కట్టేది?: సీఎం జగన్ పై కళా వెంకట్రావు సెటైర్లు

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల గేట్లకు కనీసం గ్రీజు పెట్టించలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడట? అంటూ సీఎం జగన్ పై మాజీ మంత్రి కళా వెంకట్రావు సెటైర్లు విసిరారు. 

tdp leader kala venkatrao satires on cm ys jagan  on three capitals issue
Author
Guntur, First Published Dec 7, 2021, 12:43 PM IST

గుంటూరు: రాజధాని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర యజ్ఞంలా సాగుతుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు (kala venkat rao) మండిపడ్డారు. రైతులు సంకల్ప బలంతోనే 37 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేసారు. ఎంతో ప్రశాంతంగా సాగుతున్న ఈ పాదయాత్ర (maha padayatra)ను వైసిపి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు కళావెంకట్రావు. 

''అమరావతి కోసం యజ్ఞంలా సాగుతున్న మహా పాదయాత్రను వైసీపీ (ysrcp) నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. నీటి ప్రాజెక్టుల గేట్లకు కనీసం గ్రీజ్ పెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా.? వైసీపీ నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారు'' అని కళా వెంకట్రావు ఆరోపించారు.

''అమరావతి (amaravati)  రైతులు, మహిళలు చేపడుతున్న పాదయాత్రకు పార్టీలకతీతంగా మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఏపీ ప్రజల (andhra pradesh people) నుండి విశేషమైన స్పందన లభించడంతో వైసీపీకి గుబులుపుట్టింది. అందుకే పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలకు కనీసం అన్నం తినడానికి కూడా స్థలాలు కేటాయించకుండా వైసీపీ నేతలు పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారు. తలదాచుకోవడానికి నీడ లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు.వైసిపి నాయకులు ప్రతిదాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు చేసే ప్రతి దుశ్చర్యకు పశ్చాత్తాపం చెందే రోజు వస్తుంది'' అని వెంకట్రావు హెచ్చరించారు.  

read more  వ్యక్తిగత మినహాయింపు.. జగన్ గేమ్ ప్లాన్.. కేసుల్ని ఆలస్యం చేయడానికే.. సీబీఐ

''మూడు రాజధానుల బిల్లు (three capital bills) పూర్తిగా వెనక్కితీసుకుంటే రాష్ట్రానికి జగన్ రెడ్డి మేలు చేసిన వ్యక్తి అవుతారు. 13 జిల్లాలకు సమానదూరంలో అమరావతి ఉంది. 175 నియోజకవర్గాల అభివృద్ధికి సరిపడే రూ.2లక్షtల కోట్ల సంపద అమరావతిలో ఉంది. ఈ సంపదనంతా జగన్ రెడ్డి బూడిదపాలు చేశారు. అలాంటి అమరావతిని జగన్ రెడ్డి వచ్చి భ్రష్టు పట్టించారు'' అని అన్నారు.

''రాజధాని (capital) లేకపోవడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధికావాలన్నా, ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడాలన్నా అమరావతిని కొనసాగించాలి'' అని కళా డిమాండ్ చేసారు. 

read more  Chandrababu Naidu: ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా..?.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

''టీడీపీ (telugudesham party) హయాంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ ఉంటే జగన్ (YS Jagan) వచ్చాక కరెప్షన్ రైజ్ స్టేట్ గా మారింది. జగన్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేలా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి అనుకూలమని చెప్పి ఓట్లు దండుకుని... అధికారంలోకి వచ్చాక వ్యతిరేకంగా వ్యవహరించడం సమంజసం కాదు. రాజధాని లేక, ఆదాయం రాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. వైసీపీ నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి'' అని కళా వెంకట్రావు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios