‘ బాడీ కాదు.. కాస్త బుర్ర పెంచండి’

First Published 14, Jun 2018, 2:21 PM IST
tdp leader jupudi prabhakar setaire to pm narendra modi
Highlights

మోదీకి టీడీపీ నేత సెటైర్
 

ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ సైటైర్ వేశారు. ప్రధాని పదవి అంటే.. కుస్తీ పోటీలు కాదని ఆయన విమర్శించారు.  ప్రస్తుతం దేశంలో ఫిట్ నెస్ ఛాలెంజ్ నడస్తున్న సంగతి తెలిసిందే. ఒకరికి మరొకరు ఫిట్ నెస్ ఛాలెంజ్ లు విసిరుతున్నారు. దీనిలో భాగంగానే  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.

ఈ సవాలును స్వీకరించిన మోదీ... దానిని అమలు చేశారు. దీనిపై టీడీపీ నేత వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రధాని పదవంటే కుస్తీ పోటీ కాదన్నారు. బాడీ పెంచడం కాకుండా కాస్త బుర్ర పెంచాల్సిందిగా ఉపదేశించారు.

బ్యాంకులను దోచుకున్న వారిని ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని జూపూడి ప్రశ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు, ప‌ట్టిసీమ సినిమాలు కాదని, జగన్‌కు నిజ‌మైన సినిమా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజలు చూపిస్తారని హెచ్చరించారు. కన్నా పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని.. అతడు జ‌గ‌న్‌కు ఏజెంట్ అని జూపూడి విమర్శలు గుప్పించారు.

loader