టెన్షన్: నేడు మాచర్లకు జూలకంటి బ్రహ్మరెడ్డి సహా నేతలు, భద్రత కల్పించాలని కోరిన టీడీపీ
పల్నాడు జిల్లాలోని మాచర్లకు చెందిన టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి సహ ఇతర టీడీపీ నేతలు ఇవాళ మాచర్లకు రానున్నారు. పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేసేందుకు బ్రహ్మరెడ్డి సహా టీడీపీ నేతలు మాచర్లకు రానున్నారు.
మాచర్ల: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి సహా మరో 23 మంది టీడీపీ నేతలు ఆదివారం నాడు మాచర్లకు రానున్నారు. 2022 డిసెంబర్ 16వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదేం ఖర్మ అనే కార్యక్రమం పందకర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ పార్టీ కార్యాలయం, తమ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు టీడీపీ నేతలు తమపై దాడికి పాల్పడినట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారు. జూలకంటి బ్రహ్మరెడ్డికి మాచర్ల అసెంబ్లీ ఇంచార్జీగా చంద్రబాబు నియిమించిన తర్వాత గొడవలు ప్రారంభమైనట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ, వైసీపీలకు చెందిన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
also read:మాచర్ల ఘర్షణ.. ఏ7 మినహా మిగిలిన టీడీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్..
ఈ విషయమై టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు జూలకంటి బ్రహ్మరెడ్డి సహా పలువురు టీడీపీ నేతలకు ఈ నెల 3న ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఏ 7గా ఉన్న కళ్లెం రమణారెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసు విషయమై మాచర్ల పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేసేందుకు గాను టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి సహా ఆ పార్టీ నేతలు రానున్నారు.జూలకంటి బ్రహ్మరెడ్డి సహా టీడీపీ నేతలు రానున్న నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే మాచర్లకు వస్తున్న జూలకంటి బ్రహ్మరెడ్డి సహా తమ పార్టీ నేతలకు భద్రతను కల్పించాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు.
మరో వైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు. 144 సెక్షన్ కేవలం తమకే వర్తిస్తుందా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వైసీపీకి 144 సెక్షన్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును టీడీపీ నేత జూలకంటి బ్రహ్మరెడ్డి వి మర్శలు గుప్పించారు. మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లా ఎస్పీ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.