Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రి: నేను ఛైర్మన్ కావడానికి.. జగన్ హెల్ప్ చేశారు, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ..  తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

tdp leader jc prabhakar reddy sensational comments on ap cm ys jagan
Author
Tadipatri, First Published Mar 18, 2021, 4:05 PM IST

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ..  తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

పట్టణంలో రౌడీయిజం... గుండాయిజం ఇక ఉండదని వెల్లడించారు. సేవ్ తాడిపత్రి తమ నినాదంగా పేర్కొన్నారు. తమ కౌన్సిలర్లు అందరూ బాహుబలిలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు అని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసించారు.

తాను మున్సిపల్‌ చైర్మన్‌ కావడానికి సీఎం జగన్‌ హెల్ప్‌ చేశారంటూ వ్యాఖ్యానించారు. జగన్‌ తలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. తాను మున్సిపల్ చైర్మన్‌ అయ్యే పరిస్థితి లేదని జేసీ స్పష్టం చేశారు.

తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణలను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని పేర్కొన్నారు.

కాగా నరాలు తెగే ఉత్కంఠ నడుమ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికవ్వగా, వైస్ చైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వడంతో ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు క్యాంప్ రాజకీయాలను సైతం ఏర్పాటు చేశాయి. మొత్తానికి జేసీ ఎన్నికతో ఉత్కంఠకు తెరపడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios