పెద్ద వాళ్లతో తనకున్న సాన్నిహిత్యం చూపి ఉద్యోగాలిప్పిస్తానని  నిరుద్యోగులనుంచి భారీ గా దండుకున్నాడని ఫిర్యాదులు

 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు కు చెందిన TDP   నాయకుడు పోలవారపు హరిబాబు ను చీటింగ్ కేసు లో  విజయవాడలో మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంగళగిరి లో ఆయన బాగా పేరున్న తెలుగు యువత నాయకుడు. అయితే,తన పలుకుబడి నుపయోగించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి హరిబాబు లక్షల్లో నగదు వసూలు చేశాడని పోలీసులకు ఫిర్యాదులందాయి. ఆయన  మంత్రుల  పేరు చెప్పి వసూళ్ల దందాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఆయన మీద ఇప్పటికే చాలా కేసులున్నాయి.  దీనితో ఈ రోజు మాటు వేసి మంగళగిరి పోలీసులు హరిబాబును విజయవాడు పట్టుకున్నారు.