Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్, పబ్జీ గేమ్ లకు అలవాటుపడిన సీఎం.. రాష్ట్ర యువత తనదార్లో నడిపించాలని చూస్తున్నాడు...జీ.వీ.ఆంజనేయులు

Drugs, PUBG గేమ్ లకు అలవాటుపడిన ముఖ్యమంత్రి, రాష్ట్ర యువతను కూడా తనమార్గలోనే నడిచేలా చేస్తున్నాడన్నారు. రాష్ట్రమంతా ముఖ్యమంత్రికి డ్రగ్స్, పబ్జీ గేమేముఖ్యమైపోయందని బాహటంగానే మాట్లాడుకుంటున్నారన్నారు. 

TDP Leader GV Anjaneyulu fires on YS Jagan
Author
Hyderabad, First Published Oct 23, 2021, 2:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాష్ట్రంలో తాలిబన్ల ప్రభుత్వం నడుస్తోందని, గంజాయి మాదక ద్రవ్యాలను, దాడులు, మానభంగాలను ప్రోత్సహిస్తున్న సర్కారుకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని, టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు స్పష్టంచేశారు. 

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు, ముంబై, కర్ణాటక పోలీసులంతా గంజాయి రవాణా క్రయవిక్రయాలకు మూలాలు ఏపీలోనే ఉన్నాయని చెబుతున్నా రని, గతంలో జైలుకువెళ్లొచ్చిన జగన్ రెడ్డి, పరిపాలనను గాలికి వదిలేసి, తనను ప్రశ్నించేవారిని జైళ్లకు పంపాలన్న సైకోమనస్త త్వంతో వ్యవహరిస్తున్నాడని G.V. Anjaneyulu ఆగ్రహం వ్యక్తంచేశారు.

Drugs, PUBG గేమ్ లకు అలవాటుపడిన ముఖ్యమంత్రి, రాష్ట్ర యువతను కూడా తనమార్గలోనే నడిచేలా చేస్తున్నాడన్నారు. రాష్ట్రమంతా ముఖ్యమంత్రికి డ్రగ్స్, పబ్జీ గేమేముఖ్యమైపోయందని బాహటంగానే మాట్లాడుకుంటున్నారన్నారు. 

గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకే రాష్ట్రాన్నికేరాఫ్ గా మార్చిన ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఏపీపరువును నడిరోడ్డుపై నిలబెట్టాడన్నారు.  ఇతరదేశాలకుకూడా ఏపీనుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సరఫరాఅవుతున్నాయంటే, అందుకు కారణం ముఖ్యమంత్రి ప్రోత్సాహమేనని టీడీపీనేత తేల్చిచెప్పారు. 

ఏపీనుంచి ప్రపంచమంతా Drug trafficking జరుగుతుంటే, దాన్ని నియంత్రించలేకపోవడం ఈ ముఖ్యమంత్రి వైఫల్యంకాదా అన్నారు. ప్రజల్లో తనపై, తనప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిన తరుణంలో ఏంచేయాలో పాలుపోనిస్థితిలోనే ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయించాడన్నారు. 

ప్రశ్నిస్తున్నTDP leadersపై అక్రమకేసులుపెట్టి,  జైళ్లకుపంపడం తప్ప, ఈ ప్రభుత్వం అసలువ్యవహారాన్ని ఎందుకు కట్టడిచేయలేకపోతోందన్నారు. Chandrababu Nayudu 36 గంటలదీక్షను దొంగదీక్ష అంటున్న తాడేపల్లి పాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు దొంగదీక్షలకు, శవరాజకీయాలకు ఆద్యులెవరో తెలుసుకుంటే మంచిదని ఆంజనేయులు హితవుపలికారు.

పీకే డైరెక్షన్లో కోడికత్తి రాజకీయాలు, శవరాజకీయాలుచేసిన వారు, దగ్గరుండి చేయించినవారు కూడా చంద్రబాబునాయుడుప్రజాస్వామ్య పరిరక్షణకోసం చేసినదీక్షను తప్పుపట్టడం హేయాతిహేయమన్నారు. మహాత్మా గాంధీగారు 75ఏళ్ల వయస్సులోకూడా దీక్షలుచేశారని, ఆరోగ్య పరంగా చంద్రబాబునాయుడు చాలా ఫిట్ గా ఉన్నారన్నారు. 

ఆయన అలా ఉండబట్టే, అన్నిగంటలపాటు అలసట లేకుండా దీక్ష చేయగలిగారన్నారు. ముఖ్యమంత్రి డ్రగ్స్ లో మునిగితేలుతూ, పబ్జీ ఆడుకుంటుంటే, తాడేపల్లి వసూల్ రెడ్డి Sajjala, షాడో సీఎంగా మారి, ప్రజలను వేధిస్తున్నాడన్నారు.  

తనపై ఉన్న కేసులతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడా... ఎప్పుడు సీఎం అవుదామా అని సజ్జల గోతికాడనక్కలా ఎదురుచూస్తున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డిలాగా  దొంగదీక్షలు, శవరాజకీయాలు చేయడం చంద్రబాబుకి చేతగాదన్నారు.  

వల్లభనేని వంశీ తిన్నింటివాసాలు లెక్కించేవారికన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడని, వంశీ కుక్కలా మొరుగుతున్నాడన్నారు. పశువులకంటేహీనంగా వంశీలాంటి వారు మాట్లాడేలా జగన్మోహన్ రెడ్డే వారిని ప్రోత్సహిస్తున్నారన్నా రు. వంశీ వ్యాఖ్యలపై ఆయనతల్లి, కట్టుకున్నభార్యే సిగ్గుతో తల దించుకుంటున్నారన్నారు. 

టీడీపీ కార్యాలయాలపై దాడులు: మొదలైన అరెస్ట్‌లు.. బెజవాడ, గుంటూరు పోలీసుల అదుపులో 21 మంది

Vallabhaneni Vamsiలాంటి వీధిరౌడీలను ప్రజలు చెప్పులతో కొట్టేరోజులు దగ్గరకొచ్చాయని ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పిలుపుతో ప్రారంభించిన జనాగ్రహ దీక్షలు 20నియోజకవర్గాల్లోకూడా జరగలేదన్న జీవీ, జనంలో జగన్ పై ఎంతఆగ్రహముందో, జనాగ్రహదీక్షల్లోనే తేలిపోయిందన్నా రు. 

ప్రజలంతా ఎప్పుడు ఈ ప్రభుత్వానికి చెప్పుదెబ్బలతో బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్నారని, జనాగ్రహం ధాటికి వైసీపీ నేతలు రాష్ట్రంవదిలిపోయే రోజుదగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తారని నమ్మి, అధికారమిస్తే, చివరకు ఏపీని, గంజాయి  మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చి, డ్రగ్సాంధ్రప్రదేశ్ గా చేశారన్నారు. 

ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి, రాష్ట్ర భవిష్యత్ ను, యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తేఅందరూ సంతోషిస్తారని ఆంజనేయులు హితవుపలికారు. 

రాష్ట్రంకేంద్రంగా సాగుతున్న గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై పొరుగురాష్ట్రాల పోలీసులు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను ఆంజనేయులు ఈ  సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios