బుగ్గనపై మండిపడ్డ టీడీపీ నేత
వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన పై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార పత్రాలను దొంగతనంగా ఢిల్లీలో బీజేపీ నాయకుల కాళ్ల ముందు పెట్టిన బుగ్గన రాష్ట్ర దోహి అని ఆయన పేర్కొన్నారు.
చట్టరీత్యా అధికార పత్రాలను స్పీకర్‌కు, శాసనసభకు తప్ప పీఏసీ చైర్మన్ ఇంకెవరికీ ఇవ్వరాదు... అలాంటిది బుగ్గన రాంజేంద్రనాథ్‌రెడ్డి ఆ పత్రాలను రాజకీయ పార్టీ నాయకులకు దొంగతనంగా ఇవ్వడం ద్వారా అధికార దుర్వినియోగానికి, సభా ద్రోహానికి, ప్రజాద్రోహానికి పాల్పడ్డారని ఆయనపై సుమోటాగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బుగ్గన ఢిల్లీ పర్యటన, బీజేపీ నాయకులతో భేటీతో బీజేపీ, వైసీపీ మధ్య కుట్రలు బయటపడ్డాయని జీవీ పేర్కొన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చు కోవడానికి వంద అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి బుగ్గనకు, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రా నికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి బుగ్గన ద్వారా ఢిల్లీకి పంపుతున్నారని.. ఇదంతా పెద్ద రాజ కీయ కుట్రని జీవీ తెలిపారు. ఢిల్లీలో ఓ నాటకం, ఇక్కడ కడపలో దొంగ ధర్నాలు, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వైసీపీ నాయకుల ప్రచారం... ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన ప్రజలు ఆ పార్టీలకు తగిన బుద్ధిచెబుతారని జీవీ జోస్యం చెప్పారు.
