Asianet News TeluguAsianet News Telugu

ఏపీ నుంచి ‘‘లులూ’’ను తరిమేశారు .. తెలంగాణ వెల్‌కమ్ చెప్పింది, కేటీఆర్ ఫోటోతో జగన్‌పై గంటా ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు . ఏపీ నుంచి లులూ గ్రూప్‌ను తరిమేశారని, తెలంగాణ వెల్‌కమ్ చెప్పిందని చురకలంటించారు. జగన్ కారణంగా విశాఖలో 5 వేలమందికి ఉపాధి దూరమైందన్నారు. 

tdp leader ganta srinivasarao slams ap cm ys jagan over lulu company ksp
Author
First Published Sep 27, 2023, 9:44 PM IST

హైదరాబాద్‌లో లులూ గ్రూప్ నిర్మించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ‘విశాఖలో 'లులూ’ను తరిమేశారు. మీకొక వందనం... ఇక్కడ ఉండలేం...అని చెప్పి వెళ్లిపోయినా 'లులూ'కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికారు. జగన్‌రెడ్డి "స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం"తో విసిగిపోయిన 'లులూ' అసలు ఏపీ(AP)లో పెట్టుబడులే పెట్టమని చెప్పేసింది. మీ రివర్స్‌ పాలనతో విశాఖలో 5 వేల మంది యువతకి ఉపాధిని దూరం చేశారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా లులూ గ్రూప్ అధినేతతో చంద్రబాబు వున్న ఫోటోను, హైదరాబాద్ లులూ షాపింగ్ మాల్‌ను కేటీఆర్ ఓపెన్ చేసిన ఫోటోను గంటా శ్రీనివాసరావు షేర్ చేశారు. 

 

 

కాగా.. హైదరాబాద్ కేపీహెచ్‌బీలో లులూ గ్రూప్ ఏర్పాటు చేసిన షాపింగ్ ‌మాల్‌ను బుధవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కేరళ నుంచి యూఏఈకి వలస వెళ్లిన యూసుఫ్ అలీ లులూ గ్రూప్ ద్వారా 25 దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని ప్రశంసించారు. 270 హైపర్ మార్ట్‌లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 

అంతర్జాతీయ వేదికలపై తనను లులూ గ్రూప్ అధినేతలు కలిసిప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంపై వారి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే లులూ గ్రూప్ హైదరాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా ఉత్పత్తులకు సంబంధిచి రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు గాను ఆ సంస్థ అధినేత యూసుఫ్ అలీకి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios