ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. గంటా శ్రీనివాసరావుకు బెయిల్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. నిబంధనలకు విరుద్దంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆరోపణలు చేస్తోంది. ఇక, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ALso Read: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్.. చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసులోనే..!!
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్టు కోసం సీఐడీ అధికారులు రాత్రికి 2.30 గంటలకు ఫంక్షల్ హాల్ వద్దకు చేరుకున్నప్పటికీ.. ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.