మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్.. చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసులోనే..!!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపించిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి గంటా శ్రీనివాసరావును, ఆయన కొడుకును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. నిబంధనలకు విరుద్దంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆరోపణలు చేస్తోంది. ఇక, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ పరిణామాలపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. అమరావతి భూముల కేసులో తన పేరు చేర్చారని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొవడానికి సిద్దమేనని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ను హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ఇక, ఇదే కేసుకు సంబంధించి శనివారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లోనే రోడ్డు మార్గంలో ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.