Asianet News TeluguAsianet News Telugu

ఈ పరిస్ధితి ఎవరికి రావొద్దు : అఖిలప్రియ భావోద్వేగం

అక్రమ కేసుల విషయంగా టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు

tdp leader, ex minister bhuma akhila priya reddy gets emotional over police cases on her family
Author
Vijayawada, First Published Nov 12, 2019, 5:01 PM IST

అక్రమ కేసుల విషయంగా టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులపై మంగళవారం ఆ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ.. తన భర్తతో పాటు కుటుంబసభ్యుల్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని... ఎలాంటి ఆధారాలు లేకుండా తన భర్తపై అక్రమ కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు.

మరోనేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. అఖిలప్రియ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం కక్షపూరిత పాలన సాగుతోందని.. ప్రతిపక్షాన్ని కనిపించకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అధికారపార్టీ టార్గెట్ చేస్తోందని నిమ్మల వ్యాఖ్యానించారు. 

Also Read:మరోసారి చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్

కాగా కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పై శివరాంరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రషర్ మిషన్  కోసం తనను బెదిరించారని శివరాంరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. మిగిలిన 60 శాతం వాటా తమ పేరుపై బదిలీ చెయ్యాలని శివరామిరెడ్డి కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగారు.

దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు....ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్లు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెల 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకుని రెండింటిని తమపేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేశారు.

Also Read:పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

కొండాపురం లో వున్న క్రషర్ క్వారీ   ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాది మేరకు భార్గవ్ రామ్ తో సహా 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భార్గవ్ రామ్పి.ఏ. మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.

ఈ కేసులో భార్గవ్ రామ్‌తో పాటు మాదల శ్రీను,నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి,శ్రీను, అల్లా సుబ్బయ్య,నాగేంద్ర,డ్రెవర్ గణేష్,మంగలి పవన్,సంపత్ నాని,షరీఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios