ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహానికి బీజేపీ విలవిలలాడిపోతోందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ రోజు కర్ణాటకలో ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించింది. కాగా ఈ విషయంపై డొక్కా మీడియా సమావేశంలో మాట్లాడారు.

 కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బతగిలిందని డొక్కా అభిప్రాయపడ్డారు. ఇదే సీను రేపు తెలంగాణ జరిగే ఎన్నికల ఫలితాల్లో రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలుగువాడి దెబ్బేంటో ప్రధాని మోదీకి ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు.

టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ వి జాతీయ భావాలేనని, వాటినే ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారని డొక్కా వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భూస్థాపితం కావడం తథ్యమని ఆయన అన్నారు.