మచిలీపట్నం, కాకినాడ పోర్ట్‌లను వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు కృష్ణపట్నం పోర్ట్‌కి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.

దానిని కూడా స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అలాగే కాకినాడ ఎస్ఈజెడ్‌ నుంచి జీఎంఆర్‌ సంస్థను తప్పుకోవాలని బెదిరించి, దానిని అరవింద్ కంపెనీకి ఇచ్చారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

అరవింద్ ఎవరో కాదని.. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడని స్పష్టం చేశారు. అంచెలంచెలుగా ఒక్కొటి ఆక్రమించుకుంటూ వచ్చారని ఇప్పుడు విశాఖలో శకుని మామ పాగా వేశారంటూ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.