ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్‌కు జగన్ సాదరంగా ఆహ్వానం పలికారు.

చందన రమేశ్ ఇప్పటి వరకు టీడీపీలో కొనసాగారు. గతంలో రాజమండ్రి గ్రామీణం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.