మమ్మల్ని కొంచెం గుర్తించండి సర్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాన్వాయిని టీడీపీ సీనియర్ నేత చలపతి అడ్డుకున్నారు. అంతేకాదు.. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న తమను కూడా కాస్త గుర్తించండి అంటూ.. వేడుకున్నారు కూడా. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. 

అసలు విషయం ఏమిటంటే.. నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడపకు చేరుకున్నారు. కాగా.. అక్కడ ఆయన కాన్వాయిని కొండాయపల్లె ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చలపతి నాయుడు, కమ్మకులస్తులు నిలిపారు. 

వెంటనే కాన్వాయిని ఆపించి.. కిందకు దిగిన చంద్రబాబుకి పూలహారం వేసి ఘనంగా స్వాగతించారు. మహిళలు హారతి నిచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబునాయుడు ద్వారా పూలమాల వేయించారు. అనంతరం చలపతి నాయుడు తన బాధను వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీలో అనేక ఏళ్లగా సేవలందిస్తున్నా పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తింపునిస్తాము. పార్టీ కోసం కస్టపడే వారిని ఎవరినీ విస్మరించేది లేదన్నారు. వీలు చూసుకుని నవనిర్మాణ దీక్షల తర్వాత అమరావతిలో కలమని చెప్పడంతో చలపతినాయుడు సంతృప్తి చెందారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, కమ్మ నేతలు, భవానీశంకర్‌, నారాయణ, నాగేంద్ర, కొండాయపల్లె కమ్మసామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు.