మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు ప్రయాణీస్తున్న కారుపై వైసీపీ నేతలు బుధవారం నాడు దాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

also read:చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి పంచకర్ల రమేష్‌ బాబు గుడ్‌ బై

గుంటూరు జిల్లా మాచర్ల  నియోజకవర్గంలో  టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకొందని  టీడీపీ ఆరోపించింది. చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో  ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

also read:బెదిరింపులు, ప్రలోభాలతో చేర్చుకొంటున్నారు.: వైసీపీలో చేరికలపై బాబు ఫైర్

దీంతో చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు,  బుద్దా వెంకన్నలు బుధవారం నాడు మాచర్లకు వెళ్లారు. ఈ సమయంలో వైసీపీ శ్రేణులు మాచర్లలో టీడీపీ నేతలు ప్రయాణీస్తున్న కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

మంగళవారం నాడు వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల తీరును పరిశీలించేందుకు ఈ ఇద్దరు నేతలు  మాచర్లకు వెళ్లారు.  వైసీపీకి చెందిన వారే తమ కారుపై దాడికి దిగారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.  

మాచర్ల రింగు రోడ్డు సెంటర్ లో పెద్ద పెద్ద కర్రలతో దాడులకు దిగారు వైసీపీ శ్రేణులు. అంతకు ముందు  కారుపై రాళ్లతో దాడికి దిగారు.  కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  కారు డ్రైవర్ సమయస్పూర్తితో  వ్యవహరించారు. 

మాచర్ల నుండి బోదలవీడుకు బొండా ఉమ, బుద్దా వెంకన్నలు కారులో వెళ్తున్నారు.  ఈ విషయం తెలుసుకొన్న వైసీపీ శ్రేణులు పథకం ప్రకారంగా దాడికి దిగారు. 

రెండు చోట్ల  వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల కారుపై దాడికి దిగారు.మాచర్ల కు సమీపంలోనే రాళ్లతో దాడికి దిగారు.  మరో వైపు  రింగ్ రోడ్డు సెంటర్ వద్ద  కారుపై పెద్ద పెద్ద కర్రలతో దాడికి దిగారు.దీంతో కారును శ్రీశైలం వైపుకు డ్రైవర్  కారును తీసుకెళ్లారు