ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పోలీసులను వైసీపీ నేతలు ఇష్టానుసారం దూషిస్తున్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

అదే తెలుగుదేశం నేతలపై మాత్రం పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తోందని వెంకన్న వ్యాఖ్యానించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బొంగులో పోలీసులు అంటున్నారని.. ఆమంచి కొజ్జా పోలీసులు అని దారుణంగా మాట్లాడారని బుద్ధా గుర్తుచేశారు.

వీటిపై పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించదా? దీనికి ఫ్యాక్ట్ చెక్ ఉండదా అని వెంకన్న ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ట్వీట్లకి వాస్తవాలు తెలుసుకోకుండా స్పందించే ఏపీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్స్... వైసీపీ నాయకులు నోటి దూలని చూసి కూడా స్పందించవా అని నిలదీశారు.

అధికార పార్టీ నాయకులైతే పోలీసులను తన్నోచ్చు, బూతులు తిట్టొచ్చు అని సీఎం జగన్ కొత్త చట్టం తెచ్చారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.