టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు గొప్పతనంపై ప్రముఖులు ఏం చెప్పారో చూడాలంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై (Ys jagan) టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న (buddha venkanna) విరుచుకుపడ్డారు. చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తూ జ‌గ‌న్ చెబుతున్నార‌ని బుద్ధా మండిపడ్డారు. 'నిన్న జగన్ రెడ్డి అసెంబ్లీలో వెకిలిగా కూసిన మూడు కూతలు. చంద్రబాబు సెల్ ఫోన్ కనిపెట్టానని, బిల్ గేట్స్, సింధుకి పాఠాలు నేర్పానని చెప్పుకుంటా తిరుగుతుంటాడు. జగన్ రెడ్డి వెటకారంగా కూసిన ఈ కూతలు బాబు గారు అనలేదు కానీ, ఈ మూడు రంగాలలో ప్రముఖులు బాబు గారి గురించి ఏమన్నారో చూడండి' అంటూ బుద్ధా వెంక‌న్న ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆయా రంగాల ప్ర‌ముఖులు చంద్ర‌బాబు నాయుడి గురించి ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు ఆ వీడియోలో ఉంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌మ‌కు అందించిన సేవ‌ల గురించి అందులో వివరించారు. 

అంతకుముందు గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సమయంలో TDP సభ్యులు వ్యవహరించిన తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. గవర్నర్‌ను అవమానించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Chandrababu సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదన్నారు. Governor వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదీ అని ఆయన గుర్తు చేశారు. గవర్నర్‌ పట్ల ఇటువంటి ప్రవర్తనతో గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. . తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. 

చంద్రబాబు చెప్పుకునేందుకు ఒక్క పథకమైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు అంటూ జగన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన ఇచ్చిన విలువ ఏమిటని సీఎం జగన్ ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలపై చంద్రబాబుకు కడుపు మంట అని జగన్ వ్యాఖ్యానించారు. తాను ఇచ్చిన మాట నిలుపుకున్నానని ప్రజలు నమ్మారని సీఎం జగన్ చెప్పారు. అందుకే ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు YCPకే పట్టం కట్టారన్నారు. ఆఖరికి Kuppam లో కూడా ప్రజలు వైసీపీని గెలిపించారని సీఎం జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

చంద్రబాబు నాయుడు సర్కార్ లంచాలు తీసుకోకుండా ఏ పథకాన్ని కూడా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. 34 నెలల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థల్లో మార్పులు తెచ్చామన్నారు. ఎవరి పాలన బాగుందో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. కొత్త జిల్లాలతో పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చట్టామన్నారు. చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయలదేన్నారు. కానీ ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో రెవిన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు. మరో వైపు Hindupuram పట్టణాన్ని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని Bala krishna ఆందోళనలు చేస్తున్నారని జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు తనకు విజన్ ఉందని చెప్పుకుంటాడన్నారు. అంత విజన్ ఉన్న నాయకుడు కుప్పంలో రెవిన్యూ డివిజన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలే ఆలోచించాలని సీఎం జగన్ చెప్పారు. 

Scroll to load tweet…