ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శల వర్షం కురిపించారు.  మూడు రాజధానుల పేరిట జగన్ మరో కుంభకోణానికి తెరలేపాడు అంటూ విమర్శలు చేశారు. మూడు రాజధానులు ముద్దు  అంటూ.. మరో ముద్దుల ర్యాలీ చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

Also Read బీజేపీ, జనసేన రెండూ రెండే... రఘురామకృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్...

గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ,ఈడీ అటాచ్మెంట్ చేసే సరికి మూడు రాజధానుల పేరుతో జగన్ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.  మరో రూ.50 వేల కోట్లు రాజధాని పేరుతో కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరో సారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడని జగన్ పై బుద్ధా విమర్శలు  చేశారు. 

విశాఖలో జరుగుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయమని చెప్పారు.  వడ్డీతో సహా జగన్ గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్ పిన్ గా మారిన విజయసాయి రెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయమని హెచ్చరించారు.