ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు, ధర్నాలు సాగుతున్నాయి. రాజధాని ఏది అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఈ సంగతి పక్కన పెడితే... జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. ప్రస్తుం దీనిపై చర్చులు కూడా జోరందుకుంటున్నాయి.

Also Read నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యల

కాగా... ఈ విషయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు.బీజేపీ, జనసేన రెండు పార్టీలు బలహీనమైనవే అని...ఆ రెండు పార్టీలు కలవాలనుకోవడం సహజమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీల పొత్తు వలన వచ్చే ఫలితం చూడాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలని వ్యాఖ్యానించారు.

 వైసీపీ చాలా బలంగా ఉందని, వారి పొత్తు వలన తమ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. రెండు పార్టీల విధివిధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు సాయంత్రంలోగా తేలుతుందని...అప్పటి వరకు వేచి చూద్దామని ఎంపీ రఘు రామకృష్ణంరాజు అన్నారు.