తెలుగుదేశం నేత చిట్టిప్రోలు సుధాకర్ మీద కేసు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని షేర్‌మహ్మద్‌పేటలో ఒక మహిళను కించపరచే విధంగా ఫేస్‌బుక్‌లో ఫొటోలు, మెసేజ్‌లు పంపినందుకు టీడీపీ నేత చిట్టిప్రోలు సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్టు చిల్లకల్లు ఎస్సై షణ్ముఖసాయి తెలిపారు. గ్రామానికి చెందిన ఓ మహిళ అతను గురించి తరచు అసభ్యకరమైన ఫొటోలు, సందేశాలు పంపిస్తున్నాడు. ఆమె మొదట సుధాకర్‌పై ఆమె గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీని వల్ల ఫలితం లేకపోయింది. ఫిర్యాదు చేస్తావా అని అతగాడుమరీ రెచ్చిపోయాడు. మరిన్ని సందేశాలు పంపిస్తుండటంతో గత్యంతరం లేక ఆమె చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించింది. ఆమె చేసిన ఫిర్యాదుకు సంబందించి పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు అతడిపై శుక్రవారం కేసు నమోదు చేశామని ఎస్ ఐ తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred