విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా పార్టీ మారాలనుకోవాలనుకొంటే   స్పీకర్ పార్మాట్‌లో  రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని బొండా ఉమ మహేశ్వరరావు వల్లభనేని వంశీకి సూచించారు.

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

సోమవారం నాడు  విజయవాడలో బొండా ఉమ మహేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు.  నిజంగా పార్టీ మారాలనుకుంటే సాంప్రదాయ ఫార్మాట్‌లో రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చన్నారు. 

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.

ఈ గందరగోళ పరిస్థితులకు పుల్ స్టాప్ పెట్టి వంశీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నట్టుగా అని బొండా ఉమ మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు.వాట్సాప్ లలో రాజీనామా లేఖలు పంపడం వల్ల ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.

Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలంటే మీడియా సమవేశం ఏర్పాటు చేసి రాజీనామా లేఖను పంపే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే  స్పీకర్ ఫార్మాట్‌ లో  రాజీనామా లేఖను అందిస్తే  రాజీనామా విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారని  బొండా ఉమ మహేశ్వరరావు చెప్పారు.

Also Read: చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ..

వాట్సాప్ మేసేజ్ లు నాలుక గీసుకోవడానికి కూడ పనికిరావని బొండా ఉమ మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. వైసీపీ వర్గీయుల వేధింపుల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వంశీ.. మళ్లీ  అదే పార్టీలోకి ఎందుకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు.

Also Read: వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే...

రెండు రోజుల్లోనే ముగ్గురు నేతలను కలిసి  గందరగోళం సృష్టించారని వంశీపై బొండా ఉమ మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ముందు రోజు చంద్రబాబునాయుడు ఆ తర్వా రోజున సుజనా చౌదరి అదే రోజు సాయంత్రం ఏపీ సీఎం జగన్ ను కలిసిన విషయాన్ని బొండా ఉమా మహేశ్వరరావు గుర్తు చేశారు.

తనపై కేసులుపెట్టినా కూడ జిల్లా పార్టీ పట్టించుకోవడం లేదంటూ జిల్లా పార్టీ నాయకత్వంపై వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. తనకు ఉన్న సమస్యలను నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని బొండా ఉమ మహేశ్వరరావు చెప్పారు.

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.