Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఏపీ నెంబర్ వన్.. జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడో : బొండా ఉమా చురకలు

దేశంలో ఎక్కడ డ్రగ్స్ బయటపడినా ఏపీ పేరే వినిపిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు. మరి ముఖ్యమంత్రి జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడంటూ ఆయన దుయ్యబట్టారు. 
 

tdp leader bonda uma slams ap cm ys jagan over drugs issue
Author
First Published Dec 6, 2022, 2:33 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఏపీ నెంబర్ వన్ అని స్మగ్లింగ్ ఇండియా ఇచ్చిన నివేదికపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 18,267 కిలోల డ్రగ్స్ దొరికాయని నివేదికలో వుందని బొండా ఉమా చెప్పారు. మరి ఈ నివేదికపై సీఎం జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

రాష్ట్రం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ అవుతున్నాయని బొండా ఉమా దుయ్యబట్టారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు అడ్డాగా మార్చారని .. దీని వెనుక సూత్రధాని విజయసాయిరెడ్డేనని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే బయటపడుతున్నాయని బొండా ఉమా విమర్శించారు. కుంభకోణాలు, దందాలు, సెటిల్‌మెంట్లతో కూడబెట్టిన సొమ్ముని జే గ్యాంగ్ ఇతర రాష్ట్రాల్లో దాస్తే పొరుగు రాష్ట్రాలు కనిపెట్టలేవా అని ఆయన ప్రశ్నించారు. 

ALso REad:వైసీసీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు..

విజయవాడలో వెలుగుచూసిన సంకల్ప సిద్ధి స్కామ్‌ వెనుక వైసీపీ నేతలు వున్నారని బొండా ఉమా ఆరోపించారు. అనేక కుంభకోణాలు, మోసాలతో కొల్లగొట్టిన కోట్లను ఇతర రాష్ట్రాల్లో వైసీపీ నేతలు పెట్టుబడులుగా పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల తాతలు, తండ్రులు జమీందారులు కాదని.. మరి ఏం వ్యాపారాలు చేసి వీరంతా కోట్లు సంపాదిస్తున్నారని బొండా ఉమా నిలదీశారు. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలే కాకుండా .. ఈ లిస్ట్ చాలా పెద్దదని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios