స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై దుండగులు బుధవారంనాడు దాడి చేశారు. 

వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము దాడి నుంచి తప్పించుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లామని చెబుతున్నారు. తమకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. కారుపై ఓ వ్యక్తి పెద్ద కర్రతో దాడి చేయడం టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. 

ఇక ఇలా టీడీపీ వారు వైసీపీ గుండాల హత్యాయత్నం అని ఆరోపిస్తుండడంతో వెంటనే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి టీడీపీ నేతల కారు ఒక వికలాంగుడిని గుద్ది వచ్చిందని. అక్కడ ఆగకుండా తప్పించుకుపోతుంటే... మాచర్ల స్థానికులు వారిపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. 

Also read: బుద్దా వెంకన్న, బొండా ఉమ కారుపై దాడిని చూడండి...

అలా ఆరోపణలు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోను, ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసాడు. అంతే కాకుండా దానితోపాటు ఎన్నిసార్లు బుద్ధ వెంకన్న కారు స్పీడ్ లిమిట్లను దాటిందో కూడా ఒక ఫోటోను అదే ఖాతాలో ఉంచాడు. 

ఈ వీడియోను కేవలం ఆయన ఒక్కరే కాకుండా వైసీపీ నేతలంతా కూడా బాగా ప్రచారంలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేసారు. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ తమ పార్టీ నేతలు ఒక వ్యక్తిని గుద్ది వెళ్లిపోయిన విషయాన్నీ ఒప్పుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ కొన్ని వైసీపీ హ్యాండిల్స్ లో బాగా సర్క్యూలేట్ అయ్యింది. 

ఒక్కసారిగా ఈ ట్వీట్ ని చూసినవారంతా షాక్ కి గురయ్యారు. తమ నేతలు గుద్దేసి వెళ్లిపోవడం తప్పేనని, కానీ దాన్ని చూపెట్టి ఇలా దాడులు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించినట్టుగా ఆ ట్వీట్లో ఉంది. 

వాస్తవానికి అదొక ఫేక్ ట్వీట్. లోకేష్ వాస్తవానికి బుద్ధ వెంకన్న, బోండా ఉమాలపై దాడిని ఖండిస్తూ వైసీపీ రౌడీ మూకలు హత్యా చేయడానికి ప్రయత్నించాయని ఉంది. ఈ రెండు ట్వీట్లను టీడీపీ పార్టీ తన అధికారక ఖతో లో నుంచి ట్వీట్ చేసింది.