‘ఏపీలో తయారవుతున్న మద్యంలో డ్రగ్స్’.. బొండా ఉమా సంచలనం...
ఏపీ లోని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే రాష్ట్రంలో డ్రగ్స్ దందా జరుగుతోందని తెదేపా నేత బోండా ఉమ ఆరోపించారు.డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డిఆర్ఐకి లేఖ రాస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసిపి రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నేరస్థులు అడ్డాగా మార్చిందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు ( Bonda Uma) విమర్శలు గుప్పించారు. పట్టుబడిన 72వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ (Heroin Smuggling) బిగ్ బాస్ ఎవరంటే వైసిపి భుజాలు తడుముకుంటోంది అన్నారు. డ్రగ్స్ కేసు(Drugs Case) లో వైసిపి (YCP) ఎందుకు ఉలికి పడుతోంది అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్ పై ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో మైనింగ్ మాఫియాలా డ్రగ్స్ సిండికేట్ అయిందన్నారు. డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వైసిపి తాట తీస్తారని తెలిపారు. తాడేపల్లి నుంచి ఢిల్లీలో డిఆర్ఐ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల కోసం పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నేరాంధ్ర ప్రదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. నిర్వాహక బిగ్ బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలో తేలుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఏపీ డ్రగ్స్ వ్యవహారం అంతా తెలుసు అని చెప్పుకొచ్చారు. టిడిపి తరఫున ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి సంబంధిత అధికారులకు తెలుపుతామని బోండా ఉమా పేర్కొన్నారు.
జగన్‌కి హైకోర్టు షాక్: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్
ఏపీ లోని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే రాష్ట్రంలో డ్రగ్స్ దందా జరుగుతోందని తెదేపా నేత బోండా ఉమ ఆరోపించారు.డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డిఆర్ఐకి లేఖ రాస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్ నే వాడుతున్నారు.
డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత వెళ్ళిందో తేలాలి. వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. నిన్న హఠాత్తుగా పేర్ని నాని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు ఎందుకు? కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడడం దేశంలో ఎప్పుడూ జరగలేదు. దేశం లోకి వచ్చిన 70 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ఎక్కడికి వెళ్లింది? ఏపీ పోలీస్ ఎందుకు విచారణ చేయట్లేదు. పెద్ద ఎత్తున దందా జరుగుతుంటే… డీజీపీ ఏం చేస్తున్నారు? అని బోండా ఉమా ప్రశ్నించారు.