Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కి హైకోర్టు షాక్: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏపీ హైకోర్టు బుధవారం నాడు సస్పెండ్ చేసింది. ఈ నెల 15వ తేదీన ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు , ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవోను జారీ చేసింది.

AP high court quashes AP government Jumbo TTD board
Author
Guntur, First Published Sep 22, 2021, 11:30 AM IST

అమరావతి:టీటీడీలో (ttd)ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జివోను ఏపీ హైకోర్టు (ap high court)బుధవారం నాడు సస్పెండ్ చేసింది. టీటీడీలో 25 మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరికొందరిని నియమించాలని ఏపీ సర్కార్ భావించింది.ఈ మేరకు జీవో విడుదల చేసింది.ఈ జీవోను టీడీపీ ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. టీడీపీ సహా మరో ఇద్దరు కూడ ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

also read:టీటీడీ ట్రస్ట్ బోర్డు: 25 మందితో కొత్త సభ్యుల జాబితా విడుదల

బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు జి. లలిత్ కుమార్ లు టీటీడీలో జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేశారు.జీవో 245 ద్వారా 25 మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీవో 568 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. జీవో 569 ద్వారా ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు.

ఈ మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ  చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

ఈ నెల 15వ తేదీన 25 మందితో టీటీడీ బోర్డు సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే రోజున ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను కూడ జీవో జారీ చేసింది.  ఈ జంబో కార్యవర్గంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.ఈ విషయమై బీజేపీ ఏపీకి చెందిన నేతలు గవర్నర్ కి కూడ ఫిర్యాదు చేశారు. జంబో కార్యవర్గంపై విమర్శలు గుప్పించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios