విశాఖపట్నం: టీడీపీ జాతీయ అధ్యక్షులు & ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిన వాల్తేరు మెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దళిత డాక్టర్ సుధాకర్ ని టిడిపి నాయకులు బృందం పరామర్శించింది. విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమారు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత,  ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు , బుద్ధ నాగజగదీశ్వరరావు, ఆళ్ళ శ్రీనివాస్ రావు, టీడీపీ ఎస్సి సెల్ అధ్యక్షులు పుచ్చా విజయ్ కుమార్ తదితరులు డాక్టర్ ని పరామర్శించారు. 

read more  ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకొన్న తల్లి

అంతకుముందే అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికన ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ''కరోనా వస్తే పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న జగన్ రెడ్డి కి పిచ్చా?కరోనా వస్తే ప్రజల ప్రాణాలు పోతాయి. మాస్కులు ఇవ్వండి మహాప్రభో అన్న డాక్టర్ కి పిచ్చా?సమాధానం చెప్పండి సాయిరెడ్డి గారు.ఒక దళిత డాక్టర్ పై పిచ్చివాడు అని ముద్ర వెయ్యడానికి ఎంత కొవ్వు నీకు?'' అని ఘాటు విమర్శలతో కూడిన ట్వీట్ చేశారు. 

''ప్రపంచమంతా వైద్యులకు సన్మానాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం డాక్టర్ల పై పిచ్చి వాళ్ళు అనే ముద్ర వేస్తుంది. జగన్ రెడ్డి,విజయసాయి రెడ్డిలకు
 పిచ్చి పట్టింది అందుకే వారికి అందరూ పిచ్చి పట్టిన వాళ్ళలా కనిపిస్తున్నారు'' అంటూ మరో ట్వీట్ ద్వారా ఎద్దేవా చేశారు.  

''మాస్కు అడిగిన పాపానికి ఒక మంచి దళిత వైద్యుడిని సస్పెండ్ చేసి పిచ్చివాడనే ముద్ర వేసారు. మాస్కు అడిగినందుకు నగరి మున్సిపల్ కమిషనర్ పై వేటు వేసారు. కరోనా ని నివారించలేక చేతులెత్తేసి డాక్టర్లను కూడా కరోనా కి బలిచ్చారు అయినా మీ అధికార మదం దిగలేదు'' అంటూ వరుస ట్వీట్లతో జగన్, విజయసాయిలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.