ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకొన్న తల్లి
ప్రభుత్వ మానసిక వైద్య శాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ను కుటుంబసభ్యులు ఆదివారం నాడు పరామర్శించారు. సుధాకర్ తల్లితో పాటు భార్య, కొడుకులు ఆసుపత్రిలో ఆయనను చూసి బాధపడ్డారు. కొడుకును చూసిన తల్లి కన్నీళ్లు పెట్టుకొన్నారు.
విశాఖపట్టణం: ప్రభుత్వ మానసిక వైద్య శాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ను కుటుంబసభ్యులు ఆదివారం నాడు పరామర్శించారు. సుధాకర్ తల్లితో పాటు భార్య, కొడుకులు ఆసుపత్రిలో ఆయనను చూసి బాధపడ్డారు. కొడుకును చూసిన తల్లి కన్నీళ్లు పెట్టుకొన్నారు.
మాస్కులు అడిగినందుకు తన కొడుకును ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని సుధాకర్ తల్లి కావేరి బాయి చెప్పారు. మాస్కులు అడగడం నేరం ఎలా అవుతోందని ఆమె ప్రశ్నించారు. డాక్టర్ గా విధులు నిర్వహించాల్సిన తన కొడుకుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆమె కోరారు. కొడుకును చూసిన ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు.
తనకు ప్రాణ రక్షణ కల్పించాలని సుధాకర్ భయపడుతున్నాడని ఆమె చెప్పారు. పిచ్చివాడిగా ముద్రవేసి తన కొడుకు జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.ప్రైవేట్ ఆసుపత్రిలో తాము స్వంత డబ్బులతో చికిత్స చేయించుకొంటామని ఆమె చెప్పారు.
also read:డాక్టర్ సుధాకర్ రావు మద్యం తాగాడు, మానసిక ఆసుపత్రిలో చికిత్స: కేజీహెచ్ సూపరింటెండ్ అర్జున్
సస్పెండైన నాటి నుండి తన భర్త మనోవేదనకు గురైనట్టుగా సుధాకర్ భార్య మంజరి గుర్తు చేసుకొన్నారు. మాస్క్ లు అడిగినందుకు సస్పెండ్ చేయడంతో ఆయన మరింత కుంగిపోయారన్నారామె. మళ్లీ ఆరోగ్యంతో తిరిగి వచ్చి వైద్యుడిగా తన తండ్రి వైద్య సేవలు అందిస్తారనే ఆశాభావాన్ని కొడుకు జతిన్ వ్యక్తం చేశారు.
శనివారం నాడు సాయంత్రం విశాఖలో డాక్టర్ సుధాకర్ అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. మద్యం తాగి ఆయన రోడ్డుపై నానా రభస సృష్టించారని పోలీసులు చెబుతున్నారు.