అమరావతి: ''తండ్రి జూమ్ లో, కొడుకు ట్విట్టర్లో వీరంగాలు వేస్తుంటారు. విష ప్రచార బాధ్యతలు ఎల్లో మీడియా చూసుకుంటోంది. ప్యాకేజీ పార్టీలు కారాలు, మిరియాలు నూరుతుంటాయి. ఎవరికీ ప్రజాదరణ లేదు. విశ్వసనీయత అసలే లేదు. అయినా నిత్యం తాటాకు చప్పుళ్లు చేస్తూనే ఉంటారు'' అంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్ కామెంట్స్ కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. 

''జగన్ రెడ్డి బూమ్, బూమ్ హ్యాంగ్ ఓవర్ లో, వీసా రెడ్డి ట్విట్టర్ మబ్బుల్లో గడిపేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బూమ్, బూమ్ జగన్ తాడేపల్లి ప్యాలస్ లో ఫిడేలు వాయిస్తున్నాడు.19 నెలల్లో ఎక్కడికి వచ్చాడు? ఎం పీకాడు?'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న ప్రశ్నించారు.

''జగన్ వీరోచిత పోరాటానికి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ ,ఆంధ్రా గోల్డ్, కరోనా తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏంటి సాయి రెడ్డి. బులుగు పత్రికలో పండగలు తప్ప జనాలకు పండగెక్కడ కసాయి?'' అంటూ విజయసాయి రెడ్డిని నిలదీశారు అయ్యన్న.