ఫిరాయింపు మంత్రికి ఏవి షాక్

ఫిరాయింపు మంత్రికి ఏవి షాక్

ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు టిడిపి నేత పెద్ద షాకే ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి తాను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఏవి చేసిన ప్రకటనతో అఖిలకు అయోమయంలో పడ్డారు. ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఏవి ఆయన మరణంతో భూమా అఖిలకు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే.

కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్ళగడ్డలో గట్టిపట్టున్న టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటనతో పై రెండు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు, శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. తీవ్ర అయోమయం నెలకొంది.

అసలే, జిల్లాలో, నియోజకవర్గంలో అఖిలప్రియ ఒంటరైపోయారు. తన వ్యవహారశైలితో తన తండ్రి నాగిరెడ్డికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళకు కూడా దూరమయ్యారు. దాంతోనే అఖిల-ఏవి మధ్య వివాదాలు మొదలై తీవ్రస్ధాయికి చేరుకున్నాయ్.

ప్రస్తుత విషయానికి వస్తే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఏవిని తొక్కేయటానికి అఖిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఏవికి మద్దతుగా భూమా కుటుంబం అంటే పడని వాళ్ళు, పలువురు మంత్రులు మద్దతుగా నిలబడ్డారు. దాంతో మంత్రి ప్రయత్నాలు కుదరటం లేదు. అందుకనే ఏవి కూడా తెగించారు.

నంద్యాలకు చెందిన ఏవి మంత్రి నియోజకవర్గమైన ఆళ్ళగడ్డలో టిడిపి కార్యకర్తల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పెద్ద వివాదామే రేగింది. అదే సందర్భంగా ఏవి మాట్లాడుతూ, అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించటం సంచలనంగా మారింది.

ఎప్పటి నుండో ఏవి టిడిపిలో నుండి వైసిపిలోకి మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. అందుకనే మంత్రి నియోజకవర్గంపైనే కన్నేశారు. ఎటుతిరిగి టిక్కెట్టు రాదు కాబట్టి అదే సాకుతో టిడిపికి గుడ్ బై చెప్పేసి వైసిపిలోకి చేరటానికి ఏవి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos