Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై విచక్షణారహిత దాడి జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న టీడీపీ నేత సైదాబిని కొందరు దారి మధ్యలోనే అటకాయించి దాడి చేశారు. రాళ్లు, కర్రతో చితకబాదారు. ఆయన వద్దు అంటూ వేడుకున్నా దాడి ఆపలేదు. వైసీపీ నేతలే దాడి చేశారని బాధితులు అంటున్నారు. కాగా, పొలం దారికి సంబంధించే ప్రత్యర్థులు గొడవకు దిగారని ఆయన కొడుకు జిలాని చెప్పాడు. 
 

tdp leader attacked with stick in guntoor
Author
Guntur, First Published Nov 24, 2021, 4:30 PM IST

అమరావతి: Guntur జిల్లాలో దారుణం జరిగింది. ఓ TDP నేతపై నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి(Attack) చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. బైక్‌పై వస్తున్న ఆయనను అడ్డగించి భౌతిక దాడికి దిగారు. రహదారి మధ్యలో కొందరు ఆయన చేతులు, కాళ్లు పట్టుకుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగా.. మరొకరు ఓ రాయితో తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఒకరు వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ నేత సైదాబిపై ఈ దాడి జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకకు బైక్ పై వెళ్లి వస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తనపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేజవారు. పొలానికి సంబంధిచిన దారి విషయంలోనే వారు కావాలనే తన తండ్రి సైదాబితో గొడవ పడ్డారని కొడుకు జిలాని ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన సైదాబిని నరసరావు పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

వీడియో ఇదే..

"

Also Read: టీడీపీ నేత పట్టాబిపై దుండగుల దాడి: జగన్ సర్కార్‌కి బాబు వార్నింగ్

రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడి సతీమణిపై అభ్యంతరకర వ్యాఖ్యల అంశమై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంద్రబాబు (Chandrababu Naidu)  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. 

‘బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలను గురిచేసినా భరించాం. అధికారంలో ఉన్నప్పుడూ నేనెవరినీ కించపరచలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా శాసన సభలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకుని నాకు క్షమాపణ చెప్పారు. అవతలి వ్యక్తులు బూతులు తిడుతున్నా.. సంయవనం పాటిస్తున్నాను. రేండున్నరేళ్లుగా అవమానిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. అధికారంలోకి వచ్చాక మా పార్టీ నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టున్నారు.  నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య పోత్సహించింది. హుద్ హుద్ తుపాన్ సమయంలో విశాఖపట్నంలో చాలా రోజులు ఉన్నాను శాసన సభలో తన ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆలోచించుకోవాలి. నేను మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారని వాపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios