రాజమండ్రి జైలు సూపరింటెండ్ పై నిఘా: బాబుతో ములాఖత్ తర్వాత అచ్చెన్నాయుడు

 రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు  చంద్రబాబు సలహాలు, సూచనలు ఇచ్చారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.

TDP leader Atchannaidu Serious Comments Rajahmundry Central jail superindent lns

రాజమండ్రి:క్షేత్ర స్థాయిలో జనసేనతో కలిసి  ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.చంద్రబాబుతో ములాఖత్ పూర్తైన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సోమవారంనాడు సాయంత్రం టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  మీడియాతో మాట్లాడారు.చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారన్నారు.ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు తెలిపారు.ఏదైనా కేసు పెట్టాలంటే  కనీస ఆధారాలుండాలన్నారు.కనీస ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై కేసు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాంలో  సీఐడీ చంద్రబాబును అరెస్టు చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున  ఆందోళన చేస్తున్నారన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా ప్రపంచంలోని 70 దేశాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా  హైద్రాబాద్ నుండి రాజమండ్రికి ర్యాలీగా వచ్చిన  ఐటీ ఉద్యోగులను  పోలీసులు అడ్డుగా ఉన్నారని  అచ్చెన్నాయుడు చెప్పారు.

also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: బాబుతో భువనేశ్వరి,బ్రహ్మణి ములాఖత్

చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. జైలులో పరిశుభ్రత సరిగా  లేదని  అచ్చెన్నాయుడు ఆరోపించారు. జైలు సూపరింటెండ్ పై  నిఘా పెట్టారని  అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజమండ్రి జైలులో దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారన్నారు.  జైలులో సౌకర్యాలను మెరుగుపర్చాలని  తాము  సూపరింటెండ్ ను కోరినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios