ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కోడికత్తి డ్రామా ఆడుతుంటే.. జనసేన అధినేత పవన్ ఇసుక లారీ డ్రామా ఆడుతున్నారని టీడీపీ మహిళా నేత అనురాధ విమర్శించారు. పవన్.. తమ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని విమర్శించడానికి పవన్ ఎంత.. ఆయన అనుభవం ఎంత... అంటూ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పవన్ కల్యాణ్ వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

 పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని వాహనమే నేరుగా ఇసుక లారీని ఢీకొట్టిందని, అయితే... తనపై ఇసుక లారీతో దాడి చేశారని పవన్ మాట్లాడటం దారుణమన్నారు. అలాగే నరేంద్ర మోడీ, కేసీఆర్‌ల వయసు గురించి మాట్లాడే దమ్ము పవన్‌కు ఉందా... అంటూ ఆమె ప్రశ్నించారు.