నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు, ఆనం వివేకానంద రెడ్డి మరణించారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.. రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానంతో, అనేక సంచలనాలకు ఆయన చిరునామా.. నెల్లూరు జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా వెలిగారు.. మూడు సార్లు ఎమ్మెల్యే గా వరుసగా ఒకే స్తానం నుంచి గెలిచిన రికార్డు ఆయనకే దక్కింది.....