ఏలూరు: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అంబికా  కృష్ణ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. సోమవారం నాడు అంబికా కృష్ణ న్యూఢిల్లీకి వెళ్లారు. న్యూఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో అంబికా కృష్ణ చేరనున్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  ఎఫ్ డీ సీ ఛైర్మెన్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో  ఎఫ్‌డిసీ ఛైర్మెన్ పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేశారు. 

గతంలో ఏలూరు నుండి అంబికా కృష్ణ టీడీపీ అభ్యర్ధిగా  విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అంబికా కృష్ణకు టిక్కెట్టు ఇవ్వలేదు.  2014, 109 ఎన్నికల్లో ఈ స్థానంలో బడేటి బుజ్జికి టిక్కెట్టు కేటాయించారు.  దరమిలా  అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని అమలు చేయలేదు. ఎఫ్‌డీసీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.

రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంంపీలు బీజేపీలో చేరారు. వారి బాటలోనే అంబికా కృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు బీజేపీ అగ్రనేతల సమక్షంలో అంబికా కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారు.